వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరు ఎస్‌ఐ కాలనీలో రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో రహదారుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
రహదారుల నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

