Back to feed
పామును పట్టుకోబోయి కాటు తిన్న అమెరికా మంత్రి
Ravi Shukla May 27, 2026 9:01 AM అల్ ఇండియా 13 viewsabout 9 hours ago

అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ పామును పట్టుకోవడానికి ప్రయత్నించి కాటు తిన్నారు. ఫ్లోరిడాలో రెండు 'బ్లాక్ రేసర్' జాతి పాములను ఆయన చేతులతో పట్టుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అయితే, అది విషరహిత పాము కావడంతో ప్రమాదం తప్పింది.
వన్యప్రాణులపై ఎంతో ఆసక్తి చూపే కెన్నెడీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్‌గా మారింది. గతంలో ఆయన ఒక చనిపోయిన వన్యప్రాణి శరీర భాగాన్ని పరిశోధనల కోసం సేకరించి వివాదాల్లో నిలిచారు.
Comments
Loading comments...

