వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలు, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ వంటి చారిత్రక ప్రదేశాలను స్మారక చిహ్నాలుగా తీర్చిదిద్దుతూ ఆయన జ్ఞాపకాలను పదిలం చేస్తున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఏజెన్సీ వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గిరిజనులను ఏకతాటిపై తెచ్చి విల్లంబులతోనే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి, కేవలం 27 ఏళ్లకే ప్రాణత్యాగం చేసి దేశ చరిత్రలో మన్యం వీరుడిగా నిలిచారు.
Comments
Loading comments...

