వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్య పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని శివ పరాశక్తి పీఠంలో పరమశివునికి బుధవారం విశేష పూజాలు అభిషేకాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వేదమంత్రోచ్ఛారణలు, తాంత్రిక పూజా విధానాల నడుమ శివయ్యకు పంచామృతాభిషేకం, గంధాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. అమావాస్య ప్రత్యేకతను పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం చేయడం భక్తులను ఆకట్టుకుంది.
Comments
Loading comments...

