Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలయ్ బలాయ్ కి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం పలికిన బండారు దత్తాత్రేయ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 7:56 PM రంగారెడ్డిGeneral
అలయ్ బలాయ్ కి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం పలికిన బండారు దత్తాత్రేయ - Udayam
హైదరాబాద్‌లో ఎపి సీఎం చంద్రబాబు నాయుడును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘అలయ్-బలయ్–2026’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన చంద్రబాబు కార్యక్రమానికి తప్పకుండా వస్తానని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అలయ్-బలయ్ ప్రతీకగా నిలుస్తోందని దత్తాత్రేయ వివరించారు.

Comments

G
Loading comments...