వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటిక్యాల మండలంలోని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు. మునగాల, జింకలపల్లి శివార్లలో ఆకుకూరలు, బెండకాయ, టమాటా పంటలను సాగు చేస్తున్నారు.
వర్షాలు సరిగా కురవకపోవడం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి అనుసంధాన కాలువల నుంచి సాగునీరు లభించడంతో ఈ పంటల వైపు మొగ్గుచూపుతున్నామని రైతులు తెలిపారు. తొలకరి వర్షాలతో పత్తి, కంది సాగు చేసి అప్పుల పాలయ్యామని వారు వాపోయారు.
Comments
Loading comments...

