Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వోగా రియాజ్ బేగ్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 13, 2026 10:58 AM అల్లూరి General
అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వోగా రియాజ్ బేగ్ - Udayam
అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డా. ఎం. రియాజ్ బేగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఎంహెచ్‌వో డా. కృష్ణమూర్తి నాయక్ సస్పెండ్ కావడంతో డా. రామారెడ్డిని నియమించారు. ఆయన విధుల్లో చేరకుండానే సెలవుపై వెళ్లారు. దీంతో అన్నమయ్య జిల్లాలో డీపీఎం ఎన్‌పీసీబీ అండ్ వీగా పనిచేస్తున్న డా. రియాజ్ బేగ్‌కు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...