Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లర్లు వద్దు భక్తిశ్రద్ధలే ముద్దు

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 9:07 AM కామరెడ్డిGeneral
అల్లర్లు వద్దు  భక్తిశ్రద్ధలే ముద్దు - Udayam
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని ఎస్ఐ రంజిత్ సూచించారు. గ్రామ పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాల వద్ద అల్లర్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డీజేలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Comments

G
Loading comments...