Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురప్పగారిపల్లెకు స్మశాన స్థలం కేటాయిస్తాం: తహశీల్దార్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 03, 2026 6:47 PM కడపGeneral
గురప్పగారిపల్లెకు స్మశాన స్థలం కేటాయిస్తాం: తహశీల్దార్ - Udayam
పోరుమామిళ్ల మండలం గురప్పగారిపల్లె ఎస్సీ మాదిగలకు స్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాలువ గట్టుపై మృతదేహాలను ఖననం చేయాల్సి వస్తోందని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన, స్మశాన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...