Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపురం గాంధి బొమ్మ సమీపములో ఉత్సవాలకు శ్రీకారం

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 1:04 PM విశాఖపట్నంGeneral
అల్లిపురం గాంధి బొమ్మ సమీపములో ఉత్సవాలకు శ్రీకారం - Udayam
అల్లిపురం మెయిన్ రోడ్డు గాంధీబొమ్మ సమీపంలో శ్రీ ధనశక్తి దుర్గాదేవి ఆలయ పీఠం ఆధ్వర్యంలో జరగబోయే దసరా ఉత్సవాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో మహిళలు ఉత్సవ రాటను వేశారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రవివర్మ ఉత్సవ తేదీలను ప్రకటించారు. అక్టోబరు 11 నుంచి 20 వరకు నవరాత్రులు జరుగుతాయని, ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...