Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు అలర్ట్: ఎలహంక-బిలాస్‌పూర్‌ సమ్మర్ స్పెషల్ రైళ్లు

Follow Udayam on Google
Sonia Singh Jun 04, 2026 12:57 PM హైదరాబాద్General
ప్రయాణికులకు అలర్ట్: ఎలహంక-బిలాస్‌పూర్‌ సమ్మర్ స్పెషల్ రైళ్లు - Udayam
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలహంక-బిలాస్‌పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జూలై 2వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు. బిలాస్‌పూర్ నుండి ప్రతి బుధవారం, ఎలహంక నుండి ప్రతి గురువారం ఈ రైళ్లు బయల్దేరుతాయి. ఈ రైళ్లకు సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, ఖాజీపేట్, అనంతపురం, గుంతకల్ సహా పలు ప్రధాన స్టేషన్లలో స్టాపింగ్స్ కల్పించారు.

Comments

G
Loading comments...