వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లి మండలంలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నారు. అర్హులైన పిల్లలు, కిశోర బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వైద్యాధికారులు లిఖిత, లియోన్ తెలిపారు.
ఆ రోజు మాత్రలు తీసుకోలేని వారికి అక్టోబర్ 5న మాప్‌అప్ డే సందర్భంగా అందిస్తారు. పిల్లలందరూ మాత్రలు వేసుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

