Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Sep 30, 2026 6:41 PM జాతీయంGeneral
అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌ షా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్‌ 3న రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని, మరుసటి రోజు తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్‌ పార్క్‌లో డెయిరీ మిల్క్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌లోని ఓ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...