వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని మహిళా గ్రంథాలయం పాత గోడ బుధవారం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గోడకు సమీపాన ఉన్న సుమారు 7 బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ గోడ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాణ్యత లేని పాత గోడ కావడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
Comments
Loading comments...

