వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్ఐ గంగారాం ఆదివారం తెలిపారు. లంబాడితండాకు చెందిన రాజేశ్, బి.రాజేశ్ బైక్ పై 20లీటర్ల గుడుంబా విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొని గుడుంబా సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు
Comments
Loading comments...

