వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం వద్ద అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
చిన్నమండవ మున్నేరు నుంచి వీటిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్సై నరేష్ వెల్లడించారు. ఈ మేరకు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

