వార్తలకు తిరిగి వెళ్లండి
PDPL పట్టణంలోని జెండా చౌరస్తా వద్దగల ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది. పిల్లలకు తినిపిస్తుండగా పురుగు కనిపించడంతో బాధితుడు సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు తనిఖీ చేయగా, ఇతర ఐస్‌క్రీమ్‌లలోనూ పురుగులు లభ్యమయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

