Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI, డేటా ల్యాబ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 6:20 PM శ్రీకాకుళంGeneral
AI, డేటా ల్యాబ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
​శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐ (డీఎల్‌టీసీ)లో ఏఐ, డేటా ల్యాబ్‌లలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడి వి.రఘురాం తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ, సీఎస్‌ఈ, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, బీసీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...