వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ 157వ జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ జయంతి వేడుకలలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
భారత దేశ స్వాతంత్ర్య సాధనకు అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకునివచ్చి, అహింస ద్వారా స్వాతంత్ర్య పోరాటం చేసిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.
Comments
Loading comments...

