Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాదే ప్రవేశాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మధిర ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాదే ప్రవేశాలు - Udayam
మధిర ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. చివరి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ కళాశాలను చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు కోర్సులతో కళాశాల ప్రారంభానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో అనుమతి ఉత్తర్వులు వెలువడనున్నాయని పేర్కొన్నారు. చివరి విడత కౌన్సెలింగ్‌లో నేడు స్లాట్ బుకింగ్, ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

Comments

G
Loading comments...