Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసుల ఘనంగా 'అకాడి' పండుగ

Follow Udayam on Google
Anusha Jun 18, 2026 3:25 PM ఆదిలాబాద్General
ఆదివాసుల ఘనంగా 'అకాడి' పండుగ - Udayam
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలో ఆదివాసులు 'అకాడి' పండుగను ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని వన దేవతకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పశువులకు కొత్త మేత తినిపించి, మూగజీవాలకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ పూజల అనంతరం గ్రామస్తులందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సర్పంచ్ జంగు పటేల్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంప్రదాయాలను చాటిచెప్పారు.

Comments

G
Loading comments...