Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్‌లో ఆదివరాహస్వామి జయంతోత్సవాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 08, 2026 6:36 PM పెద్దపల్లి General
కమాన్‌పూర్‌లో ఆదివరాహస్వామి జయంతోత్సవాలు - Udayam
కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతోత్సవాలను ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్‌ ముస్త్యాల దామోదర్‌, ఈవో కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు తెలిపారు. 23న విష్ణుసహస్రనామ పారాయణం, 24న ఆదివరాహ హోమం, 25న కల్యాణోత్సవం, 26న 108 కలిశాల అభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...