వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు గుంతల్లో దిగడంతో టైర్లు, ఇతర భాగాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

