Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అదనపు విత్తన సబ్సిడీ ఇవ్వాలి: చింతమనేని

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 2:01 PM ఏలూరుGeneral
రైతులకు అదనపు విత్తన సబ్సిడీ ఇవ్వాలి: చింతమనేని - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. జిల్లా సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. మినుము, పెసర పంటల సాగుతో వచ్చే ఆదాయాన్ని రైతులకు వివరించాలని కోరారు. విత్తనాలపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీకి అదనంగా సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...