Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 5:26 PM నారాయణపేటGeneral
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ - Udayam
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు నరహరి డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ స్కూళ్లపై నిర్వహించిన సర్వేలో అధిక ఫీజుల వసూళ్లు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...