వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై గురువారం భారీ వర్షాల కారణంగా జలాశయం దిగువన ఉన్న ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డుపై పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రోడ్డుపై బండరాళ్లు తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

