Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు.. కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం

Follow Udayam on Google
Ajay Krishna Aug 18, 2026 7:55 PM సంగారెడ్డిGeneral
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు.. కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం - Udayam
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్‌, వీధిదీపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోచారం, లకడారం సబ్‌స్టేషన్లను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు

Comments

G
Loading comments...