వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు 'అభయ' పేరుతో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, బస్టాండ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. వేధింపులకు గురైనవారు లేఖ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ మహిళా అధికారులు పరిశీలించి వేధింపులకు పాల్పడేవారిపై తక్షణ చర్యలు తీసుకుంటారు. డయల్ 112, షీ టీమ్స్, శక్తి యాప్‌లపై మహిళలకు అవగాహన కల్పిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

