Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్‌ కస్టడీకి కోర్టు అనుమతి

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 2:05 PM హైదరాబాద్General
ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్‌ కస్టడీకి కోర్టు అనుమతి - Udayam
బొల్లారం ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతించింది. ఎల్లుండి నుంచి ఆయనను కస్టడీలోకి తీసుకుని మరికొందరితో కలిసి విచారించనున్నారు. ఆయుధాలను ఎవరికి అప్పగించాలనుకున్నాడు, చోరీ వెనుక నెట్‌వర్క్‌ ఏంటనే దానిపై ఆరా తీయనున్నారు.

Comments

G
Loading comments...