Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవుకు శస్త్రచికిత్స చేసి ప్రాణం కాపాడిన వైద్యాధికారి

Follow Udayam on Google
Hari Sep 29, 2026 11:55 AM శ్రీకాకుళంGeneral
ఆవుకు శస్త్రచికిత్స చేసి ప్రాణం కాపాడిన వైద్యాధికారి - Udayam
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రభుత్వ పశు వైద్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ శస్త్రచికిత్స చేసి ఆవును బతికించారు. నరసన్నపేట మండలం కొల్లివానిపేట గ్రామానికి చెందిన సుంకర శాంతి భాస్కరరావుకు చెందిన 9 నెలల చూడితోనున్న పుంగనూరు జాతి తొలిచూలు ఆవు ప్రసవ వేదనతో ఇబ్బంది పడింది. కడుపులో దూడ మృతి చెందడంతో రైతు ఆమోదం మేరకు గర్భాశయ ముఖద్వారం ద్వారా దూడను బయటకు తీశారు.

Comments

G
Loading comments...