Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
p.g.murthy Aug 09, 2026 2:06 PM మంచిర్యాలGeneral
ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం వారు లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో యూత్ కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. అనంతరం కేకును కట్ చేశారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని నాయకులను కోరారు.

Comments

G
Loading comments...