Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోను తప్పించబోయి బోల్తా పడిన టిప్పర్

Follow Udayam on Google
ఆటోను తప్పించబోయి బోల్తా పడిన టిప్పర్ - Udayam
ఉప్పునుంతల మండలం లతీఫ్‌పూర్ శివారులోని జాతీయ రహదారి 765 పై డిండి కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి అయ్యవారిపల్లి పలుగు క్వారీ నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ లారీ నుంచి దూకడంతో చేయి విరిగింది. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉప్పునుంతల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...