Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోల నిరవధిక బందుకు మద్దతు ఇవ్వాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 7:55 PM మంచిర్యాలGeneral
ఆటోల నిరవధిక బందుకు మద్దతు ఇవ్వాలి - Udayam
సమస్యల పరిష్కారం కోసం ఆటో కార్మికులు నిర్వహించే నిరవధిక బందుకు అందరూ మద్దతు ఇవ్వాలని మంచిర్యాల ఆటో జేఏసీ నాయకులు కోరారు. నిరవధిక బంద్ నేపథ్యంలో వారు ఆదివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని ఐబి వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. రవాణా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.

Comments

G
Loading comments...