Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 7:56 PM మంచిర్యాలGeneral
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి - Udayam
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యురాలు పోతు విజయ శంకర్ కోరారు. ఆదివారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. దీంతో ఆటో, రవాణా రంగం కార్మికులు అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకొని పరిష్కరించాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...