వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సీహెచ్.సతీశ్ తెలిపిన వివరాల మేరకు కానిస్టేబుళ్లు లింబాద్రి, సురేశ్ వెంటనే స్పందించారు.
ఫ్లడ్ కెనాల్ సమీపంలో వ్యక్తిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Loading comments...

