Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రుల నిబంధనలపై కలెక్టరేట్లో సమీక్ష

Follow Udayam on Google
K. Venkatesh Sep 29, 2026 5:21 PM ఖమ్మంGeneral
ఆసుపత్రుల నిబంధనలపై కలెక్టరేట్లో సమీక్ష - Udayam
ఖమ్మం క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ ను వచ్చే నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10 పడకల లోపు ఉన్న ఆసుపత్రుల పార్కింగ్ వర్గీకరణను పరిశీలించాలన్నారు. లోపాలున్న డయాగ్నోస్టిక్ కేంద్రాలకు నోటీసులు జారీ చేస్తామన్నారు.

Comments

G
Loading comments...