వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస (మ) కె.సి.పేట, బొడ్డేపల్లి పేట, సైలాడ తదితర గ్రామంలో తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ శాఖ ఏఈ రవి కుమార్ ఆధ్వర్యంలో లైన్మన్ రామ్మోహన్, సిబ్బంది దెబ్బతిన్న విద్యుత్ లైన్ ను పరిశీలించి, చెట్టు కొమ్మలను తొలగించి మరమ్మతులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామని ఏఈ తెలిపారు.
Comments
Loading comments...

