వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు చెన్నకేశవస్వామి ఆలయ దోపిడీ కేసులో పిడుగురాళ్లకు చెందిన పాత నేరస్థుడు కోటయ్యను పోలీసులు అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలో జయంతిపురం వాసితో ఏర్పడిన పరిచయంతో ఆలయం గురించి తెలుసుకొని రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో 12 గంటల్లో కేసును ఛేదించి, నిందితుడి నుంచి రూ.15 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

