వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ తాలూకాకు చెందిన 43 మంది బాధిత కుటుంబాలకు సీఎం సహాయక నిధి కింద మంజూరైన రూ.20,84,043 విలువైన చెక్కులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు. వైద్యం, ఇతర అత్యవసర అవసరాల కోసం ఈ సాయం అందించినట్లు తెలిపారు.
కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు ఆళ్లగడ్డ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

