30 ఏళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచి పీఠం

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఆజూరు పంచాయతీలో 1996 నుంచి సర్పంచి పదవి ఒకే కుటుంబంలో కొనసాగుతోంది. తొలుత చోడిపల్లి సూరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన సోదరుని కుమారుడు అప్పలస్వామి మూడుసార్లు ఎన్నికయ్యారు.
2016లో సూరయ్య కోడలు రాధ, 2021లో కుమారుడు సుందరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026తో సుందరరావు పదవీకాలం ముగియగా, ఈసారి కూడా ఏకగ్రీవ ఎన్నిక కోసం చర్చలు సాగుతున్నాయి.
Comments
Loading comments...
