వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి, మత సామరస్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

