వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాల్లోనే అధికారులకు దరఖాస్తులు అందజేయాలని, స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

