Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని ఇంద్రనగర్‌లో దొంగల హల్‌చల్

Follow Udayam on Google
NAGENDRA Aug 24, 2026 10:38 AM కర్నూలుGeneral
ఆదోని ఇంద్రనగర్‌లో దొంగల హల్‌చల్ - Udayam
ఆదోనిఎరుకల కాలనీలో ఇద్దరు దొంగలు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నల్ల ముసుగులతో దొంగలు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దుర్గప్ప ఇంట్లో 4 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.4 లక్షల నగదు చోరీకి గురైంది. మరో ఇంట్లో తులం బంగారం,12 తులాల వెండి, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...