వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గత నెల 30న నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. రెండో అంతస్తులోని ఆర్‌ఐసీయూ, చెస్ట్ వార్డు నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు మాయమయ్యాయి.
ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై డ్యూటీ డాక్టర్లు, భద్రతా సిబ్బంది సహా 10 మందికి అధికారులు మెమోలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

