Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులు

Follow Udayam on Google
Sandeep Sep 27, 2026 12:14 PM నిర్మల్General
ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులు - Udayam
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయ సమీపంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కుల సంఘ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో బాపూజీ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...