Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

95 ఏళ్ల వైద్యనాథ్ కొండంత సంకల్పం

Follow Udayam on Google
Naresh Aug 18, 2026 10:39 AM నిర్మల్General
95 ఏళ్ల వైద్యనాథ్ కొండంత సంకల్పం - Udayam
అడుగు తీసి అడుగు వేయలేని అశక్తత.. కానీ కన్నవారు చూపిన భక్తి మార్గం, ఆ గుట్ట ఎల్లమ్మపై ఉన్న నమ్మకం ఆయనను నడిపించాయి. వంశపారపర్య ఆనవాయితీని కాపాడాలనే సంకల్పంతో, కుబీర్ మండలానికి చెందిన 95 ఏళ్ల వైద్యనాథ్ అమ్మవారి దర్శనం కోసం ఆరాటపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆలయానికి తీసుకురాగా, నడవడమే భారమైన ఆ వృద్ధుడు భక్తి పారవశ్యంతో మెట్లు ఎక్కి దిగాడు. ఈ అద్భుతాన్ని చూసి స్థానికులు భక్తిభావంతో ముక్కున వేలేసుకున్నారు.

Comments

G
Loading comments...