వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం పార్వతీపురం చర్చి సెంటర్ వద్ద చేపట్టిన సాధన దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరుకున్నాయి. రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సామాజికవేత్త యాళ్ల మల్లేష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 90 శాతం పూర్తయిన జంఝావతి ప్రాజెక్టు పనులను ప్రారంభించే వరకు దీక్షలు కొనసాగిస్తామని సాధన సమితి నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

