Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు పూర్తి

Follow Udayam on Google
Hari Sep 29, 2026 2:35 PM శ్రీకాకుళంGeneral
80 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు పూర్తి - Udayam
జలుమూరు మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం సజావుగా ముగిశాయి. మండలంలోని 81 పాఠశాలలకు గాను 80 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎం.వి.ఆర్.ఎస్ ప్రసాదరావు తెలిపారు. శ్రీముఖలింగం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్నిక ఫలితం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. దీనిపై దృష్టి సారిస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...