వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలకు చెందిన ఎనిమిదేళ్ల జువ్వాజి ఆరాధ్య యోగాసనాల్లో అరుదైన గుర్తింపు సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. రాజభుజంగాసనాన్ని 14 నిమిషాల 33 సెకన్ల పాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.
నాలుగో తరగతి చదువుతున్న ఆరాధ్యకు ఐబీఆర్ అచీవర్ బిరుదుతో పాటు ధ్రువీకరణ అందింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యోగాసనాలు సాధన చేస్తున్నట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...
