Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం జరిగింది

Follow Udayam on Google
జయ Aug 16, 2026 4:59 PM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం జరిగింది - Udayam
గుడివాడ ఎన్టీఆర్‌ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు పేదలు దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టారని బాధితులు ఆరోపించారు. ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా దంపతులను బాధితులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...